హిందీ పాఠాలు నేర్చుకుంటున్న గోవా బ్యూటీ

హిందీ పాఠాలు నేర్చుకుంటున్న గోవా బ్యూటీ

Published on Oct 7, 2012 3:29 PM IST


సౌత్ ఇండియా లో మంచి ఫాలోయింగ్ ఉన్న గోవా బ్యూటీ ఇలియానా పేరు ప్రస్తుతం బాలీవుడ్లో బాగా వినిపిస్తోంది. ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘బర్ఫీ’ చిత్రం ద్వారా ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఈ చిత్రం తర్వాత ఆఫర్లు ఎక్కువగా వస్తుండడంతో ఇలియానా వరుసగా కొన్ని కొత్త సినిమాలను ఒప్పుకుంటోంది. ఇందుకోసమే ఇలియానా ముంబైకి మకాం మార్చుకోవాలనుకుంటోందని మరియు అక్కడ ఓ ఇల్లును కొనుక్కోవాలని ప్రయత్నిస్తోందని మేము ఇది వరకే తెలిపాము. తాజా సమాచారం ప్రకారం ఈ గోవా బ్యూటీ తన హిందీ భాషా పరిజ్ఞాన్నాన్ని పెంచుకోవాలని హిందీ పాఠాలు నేర్చుకుంటోంది. బర్ఫీ చిత్రంలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ హిందీ అంత అనర్గళంగా మాట్లాడలేక పోతున్నాను అనే ఫీల్ తో ప్రస్తుతం హిందీ పాఠాలు నేర్చుకుంటోంది. హిందీ పండితులు ఇలియానాకి హిందీ బాగా నేర్పిస్తారాని ఆశిద్దాం. ఇలియానా తెలుగులో అల్లు అర్జున్ సరసన నటించిన ‘జులాయి’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

తాజా వార్తలు