ఇళయరాజా వేదిక మీదకు వస్తున్నారంటే ప్రేక్షకులు సంగీత ప్రపంచంలో విహరించడానికి సిద్దం అయిపోతారు అలానే అయన కూడా ఎప్పుడు ప్రేక్షకులను నిరశపరచలేదు. సరిగ్గా ఇదే లక్ష్మి మంచు “గుండెల్లో గోదారి” చిత్రానికి తమిళ రూపం “మరంతేన్ మన్నితేన్” చిత్ర ఆడియో విడుదల వేడుకలో కూడా జరిగింది.లక్ష్మి మంచు, ఆది, తాప్సీ మరియు సందీప్ కిషన్ తో పాటు మోహన్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా ఈ చిత్రంలోని పాటను పాడటం ప్రధాన ఆకర్షణ. ఈ కార్యక్రమంలో మరో ఆకర్షణ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఇళయరాజాతో కలిసి పాడటం. ఈ కార్యక్రమానికి దేవిశ్రీప్రసాద్ అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయిన వారందరు ఇళయరాజా సంగీతం గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మించారు ఈ చిత్రం 1986 సంభవించిన వగోదావరి రదల నేపధ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో నవంబర్లో విడుదల కానుంది.