గుండెల్లో గోదారి చిత్రంతో మాయాజాలం చెయ్యనున్న ఇళయరాజా

గుండెల్లో గోదారి చిత్రంతో మాయాజాలం చెయ్యనున్న ఇళయరాజా

Published on Oct 12, 2012 12:30 AM IST


లక్ష్మి మంచు, తాప్సీ ,ఆది మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలలో రానున్న “గుండెల్లో గోదారి” చిత్రం చుట్టూ పలు మంచి విషయాలు ఉన్నాయి. కుమార్ నాగేద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే జనంలో భారీ అంచనాలను పెంచాయి. 1986 లో సంభవించిన గోదావరి వరదల ఆధారంగా తెరకెక్కిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు కాబట్టి సంగీతప్రియులకు ఈ చిత్ర సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. లక్ష్మి మంచు మరియు కుమార్ నాగేంద్ర చెన్నైలో ఈ చిత్ర రికార్డింగ్ కార్యక్రమాలలో ఉన్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి అర్ధ భాగం రీ రికార్డింగ్ పూర్తయ్యింది ఈ వారంతంలోగా మిగిలిన చిత్ర రీ రికార్డింగ్ కూడా పూర్తయిపోతుంది.ఈ చిత్రాన్ని మంచు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద లక్ష్మి మంచు నిర్మిస్తున్నారు. నవంబర్ మొదటి వారంలో ఈ చిత్రం విడుదల చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు

తాజా వార్తలు