రాజాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’ నిర్మాత, దర్శకుడు, హీరోగా సూపర్ రాజా ఒకే షాట్లో పూర్తి చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా సూపర్ రాజా మాట్లాడుతూ.. ‘క్రియేటివిటీ నా బ్యాక్‌గ్రౌండ్, కసి నా బలం. గివ్‌అప్ కాకుండా ప్రయత్నిస్తే మనిషి ఎంతదూరం వెళ్ళగలడో ఈ సినిమా చెబుతుంది. సెప్టెంబర్ 19న థియేటర్లో అందరూ చూస్తారు. ఈ స్థాయికి రావడానికి కారణం నా తల్లిదండ్రులు. నన్ను నమ్మి వెన్నంటి నిలిచిన వాళ్లందరికీ ధన్యవాదాలు. చీకట్లో ఎన్నో రోజులు గడిపి వెలుగుకోసం చేసిన నా ప్రయత్నం ఇప్పుడు చాలా మందికి ప్రేరణ అవుతుందని నమ్ముతున్నాను’ అన్నారు.
హీరోయిన్ చందన పాలంకి మాట్లాడుతూ.. ‘మొదట ఒకే షాట్లో సినిమా అంటే భయం వేసింది. కానీ సూపర్ రాజా కాన్ఫిడెన్స్ చూసాక ఆ భయం పోయింది. ఆయన స్పాంటీనియస్ యాక్టర్. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. సెప్టెంబర్ 19న థియేటర్లో చూడండి’ అన్నారు.
నటుడు వంశీ గోనె మాట్లాడుతూ.. ‘సూపర్ రాజా మొదటి రోజు నుంచి చూపించిన ఎనర్జీ ఇప్పటికీ అలాగే ఉంది. 1400 డైలాగ్స్ 100 నిమిషాల్లో చెప్పడం చిన్న విషయం కాదు. రెండేళ్లుగా వందల సార్లు ప్రాక్టీస్ చేశాం. ఈ సినిమా నాకు స్పెషల్. అందరూ థియేటర్లో చూడండి’ అన్నారు.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశీధర్ మాట్లాడుతూ.. ‘సూపర్ రాజా ఎంతోమంది యువతకు ఇన్స్పిరేషన్. జీవితంలో ఎదురైన కష్టాలను జయించి నిలబడిన ఆయన నిజంగా హ్యాట్సాఫ్కి పాత్రులు. ఈ సినిమా చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను. సింగిల్ టేక్‌లో ఇలా తీయడం అద్భుతం. మైత్రి ఎల్లప్పుడూ మంచి కంటెంట్‌ని ప్రోత్సహిస్తుంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందరూ 19న థియేటర్లో చూడండి’ అన్నారు.