డైరెక్టర్ కాకపోయి ఉంటే..


1983లో ‘పల్లవి అను పల్లవి’ అనే కన్నడ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమై సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు ఇంతకీ ఆ దర్శకుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? మరెవరో కాదండి ‘నాయకుడు’, ‘గీతాంజలి’, ‘బొంబాయి’, ‘రోజా’ మరియు ‘దిల్ సే’ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను మనకు అందించిన డైరెక్టర్ మణిరత్నం. సినీ రంగంలోకి మీరు రాకపోయి ఉంటే మీరు ఏమయ్యుంటారు అని ఇండస్ట్రీలో వారిని అడిగితే డాక్టర్ ని అయ్యుంటా, కలెక్టర్ అయ్యుంటా అని అనే వాళ్ళే ఎక్కువ, కానీ మణిరత్నం మాత్రం దర్శకుడు అవ్వాలనుకోలేదంట. ‘ నేను ఎం.బి.ఎ పూర్తి చేసుకున్న తర్వాత ఒక కంపెనీలో బుజినెస్ కన్సల్టెంట్ గా కెరీర్ ప్రారంభించాను. ఆ తర్వాత అనుకోకుండా దర్శకుడయ్యాను, ఇది నేను అసలు ఊహించలేదు’ అని అన్నారు. ఆయన ఈ విషయాన్ని ‘ కాన్వర్జేషన్స్ విత్ మణిరత్నం’ అనే పుస్తకంలో తెలియజేశారు. ప్రస్తుతం మణిరత్నం ‘కడల్’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version