ఈ రోజు ‘ఇద్దరమ్మాయిలతో’ సెన్సార్

ఈ రోజు ‘ఇద్దరమ్మాయిలతో’ సెన్సార్

Published on May 24, 2013 10:40 AM IST

Iddarammayilatho

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు మొదలైయ్యాయి. ప్రస్తుతం సెన్సార్ వారు ఈ సినిమాని చూస్తున్నారు. ఈ సినిమాలో అమలా పాల్, కేథరిన్ లు హీరోయిన్స్ గా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆడియో ఈ మధ్యే విడుదలై మంచి ప్రేక్షకదారణ పొందింది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా మే 31 న విడుదలకానుంది.

తాజా వార్తలు