స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్లోనే కలర్ ఫుల్ సినిమా. అందుకే తను తీసుకునే సినిమాటోగ్రాఫర్ మార్చి ఈ సినిమాకి అమోల్ రాథోడ్ ని తీసుకున్నారు. ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారం సినిమా చాలా సూపర్బ్ గా వచ్చింది.
‘ఈ సినిమా సినిమాటోగ్ర ఫీ విజువల్స్ విషయంలో పూరి జగన్నాధ్ కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. సినిమలో ప్రతి ఫ్రేం చలా రిచ్ గా, కలర్ ఫుల్ గా ఉంటుంది. బిగ్ స్క్రీన్ పై ఈ సినిమా చాలా బాగుంటుందనీ ఈ చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ పూర్తి కాగా, ఫిబ్రవరి 8 నుంచి స్పెయిన్ లొ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమలా పాల్ – కెథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు .