‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా విదేశీ రైట్స్ కి ఫ్యాన్సీ అమౌంట్

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా విదేశీ రైట్స్ కి ఫ్యాన్సీ అమౌంట్

Published on Apr 25, 2013 9:46 AM IST

Iddarammayilatho-(3)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా మేలో విడుదల కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అల్లు అర్జున్ చివరిగా నటించిన ‘జులాయి’ సినిమా మంచి సక్సెస్ ను సాదించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకి సంబందించిన విదేశీ రైట్స్ ని బ్లూ స్కై వారు 3కోట్లకు అడిగారని తెలిసింది. పరమేశ్వర ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమల పాల్, కేథరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఆడియో టిజర్ ఈ మద్య విడుదలై మంచి రేస్పాస్ ను సొంతంచేసుకుంది. ఈ సినిమా ఆడియో ఈ నెల 28న విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు