మలయాళ బ్యూటీ కేథరిన్ మొదటి సినిమా ‘చమ్మక్ చల్లో’ ఆశించినంత విజయాన్ని అందించకపోయినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన సినిమా చేసే చాన్స్ కొట్టేసింది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న కేథరిన్ ప్రస్తుతం కొన్ని క్రేజీ సినిమాల ఆఫర్లు దక్కించుకుంటోంది. మరోవైపు నాని సరసన హీరోయిన్ గా నటించిన ‘పైసా’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
స్వతహాగా కేరళ అమ్మాయి అయిన కేథరిన్ దుబాయ్ లోనే పెరిగింది. ఆ తర్వాత బెంగుళూరు లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ భామ తన సినిమాల గురించి మాట్లాడుతూ ‘నేను స్వతహాగా కేరళ అమ్మాయిని కానే నాకు మలయాళం రాదు, అలాగే తెలుగు కూడా రాదు. కానీ నేను చేసిన సినిమాలకు వేరొకరు డబ్బింగ్ చెప్పడం వల్ల ఒరిజినల్ ఫీల్ కరెక్ట్ గా రావడం లేదు అందుకే నేను ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలోనే నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటానని’ తెలిపింది.
కన్నడ, తెలుగులో సినిమాలు చేసిన కేథరిన్ తాజాగా కార్తీ సరసన ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. ఈ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతోంది.