ప్రస్తుతం మనకు టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కమెడియన్స్ లలో కృష్ణ భగవాన్ కూడా ఒకరు. హీరో పక్కనే ఉంటూ కామెడీ పండించడంలో మరియు విలన్ పక్కనే ఉంటూ ఉంటూ హీరోని పొగుడుతూ పంచ్ లు వెయ్యడంలో, వెటకారపు కామెడీ చేయడంలో కృష్ణ భగవాన్ కి మంచి పేరుంది.
కృష్ణ భగవాన్ తన కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చెప్పాలంటే సినిమాల్లోకి రాకముందు కృష్ణ భగవాన్ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ మరియు అలాగే అతనొక మైమ్ ఆర్టిస్ట్. ఆ టాలెంట్ వల్లే కృష్ణ భగవాన్ కి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ విషయం గురించి చెబుతూ ‘నాకు ఒకసారి జంధ్యాల గారి ముందు మైమ్ స్కిట్ పెర్ఫార్మ్ చేసే అవకాశం వచ్చింది. ఆయనకీ నా నటన నచ్చింది. ఆ తర్వాత ఆయన నాకు ‘శ్రీవారి శోభనం’ సినిమాలో అవకాశం ఇచ్చాడు, అదే నా మొదటి సినిమా’ అని కృష్ణ భగవాన్ చెప్పాడు.
ఆ తర్వాత ‘మహర్షి’ సినిమాలో చేసిన పాత్ర ద్వారా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చెప్పుకోదగిన సినిమాలు చేయని ఆయనికి ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో బిజీ కమెడియన్ గా మారిపోయారు.