ఆమెకి ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలనిపిస్తోందట

ఆమెకి ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలనిపిస్తోందట

Published on Oct 9, 2012 11:53 AM IST


చిన్న వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చిన హన్సికకి ఇప్పుడు మళ్ళీ స్కూల్ కి వెళ్ళాలి అనిపిస్తోందట ‘ నేను స్కూల్లో నా క్లాస్ రూంలో గడిపిన మధుర క్షణాలు నాకు బాగా గుర్తొస్తుంటాయి. ఇది అంతగా బాగుండదేమో కానీ మళ్ళీ యూనిఫార్మ్ వేసుకొని స్కూల్ కి వెళ్లి చదువుకుంటే ఎంత బాగుంటుందో?’ అని ఆమె అన్నారు.

ఆమె మనసులో మాట విని దేవుడు తదాస్తు అన్నాడేమో ఆమె కల ఇట్టే నెరవేరింది. అలా అని ఆమె మళ్ళీ స్కూల్ కి వెళ్తోంది అనుకుంటే మాత్రం అరటి తొక్క మీద కాలేసినట్టే, హన్షిక కల సిల్వర్ స్క్రీన్ పై నెరవేరింది. ప్రస్తుతం హన్షిక సూర్య సరసన ‘సింగం 2’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో హన్సిక యూనిఫార్మ్ వేసుకొని స్కూల్ కి వెళ్ళే కొన్ని సన్నివేశాలున్నాయి ఆ సన్నివేశాలను ఇటీవలే చిత్రీకరించారు. ఆ సీన్స్ గురించి హన్సిక మాట్లాడుతూ ‘ ఆ సన్నివేశాలు చేసేటప్పుడు చాలా సందడి సందడిగా ఉనింది. పిల్లలతో స్కూల్లో కూర్చొని ఉన్నప్పుడు నాకు నా స్కూల్ డేస్ బాగా గుర్తొచ్చాయి’ అని ఆమె తన గత స్మృతుల్ని గుర్తుతెచ్చుకున్నారు.

ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతున్న హన్సిక సినిమాలను నిర్మించాలని అనుకుంటోంది. తనకి హిందీ, తెలుగు మరియు తమిళ భాషల్లో సినిమాలు తీయాలని ఉందని, ‘ నా కల త్వరలోనే నిజమవుతుందని ఆశిస్తున్నాను’ అని హన్సిక తన మదిలోని మాటను బయట పెట్టింది.

తాజా వార్తలు