మణిశర్మపై హత్యాయత్నం కేసు పెడదామనుకున్నా – రామ్

Ongole-Gittha-audio-launch-
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా గుంటూరు మిర్చి యార్డ్ నేపధ్యంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘ఒంగోలు గిత్త’. ఇప్పటివరకూ క్లాస్ సినిమాలు తీసి అలరించిన ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ మాస్ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకర్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సూపర్ హిట్ సినిమా డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి హాజరయ్యారు.

ఈ వేడుకలో రామ్ మాట్లాడుతూ ‘ మార్కెట్ యార్డ్ నేపధ్యంలో రానున్న ఈ సినిమాలో డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. జి.వి ప్రకాష్ కుమార్, మణిశర్మ మ్యూజిక్ చాలా బాగుంది. అసలు మణిశర్మ గారు నా మీద హత్యాయత్నం చేసారని కేసు పెడదాం అనుకున్నా.. ఎందుకంటే ఈ సినిమాలోని ఒక మాస్ సాంగ్ కి ఆయన ట్యూన్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ కి తగ్గట్టు డాన్సులు చేయడానికి చాలా కష్టపడ్డాను. అంతలా ఆ ట్యూన్ ఉందని’ అన్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాత.

Exit mobile version