ఈ స్టొరీతో 4 సంవత్సరాలు నిరీక్షించా – విజయ్ కుమార్

ఈ స్టొరీతో 4 సంవత్సరాలు నిరీక్షించా – విజయ్ కుమార్

Published on Apr 24, 2013 8:30 AM IST

vijay
‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ తన మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో అతనికి వచ్చిన గుర్తింపుకి ఎంతో సంతోసిస్తున్నాడు. అలాగే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి పూర్తవడానికి అతను పడ్డ కష్టాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. ఈనాడు కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ స్టొరీ పట్టుకొని నాలుగు సంవత్సరాలు నిరీక్షించాను. ఈ స్టొరీని చాలా మందికి వినిపించాను, అందరికి నచ్చింది కానీ ఒక్కరు కూడా సినిమా చేయడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత నేను నితిన్ కి స్టొరీ చెప్పాను అంతటితో అంతా మారిపోయింది. అతని స్టొరీని నమ్మాడు, అతని వల్లే నేను ఈ రోజు ఇక్కడున్నానని’ అన్నాడు.

కొన్ని సార్లు సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకూ, సరైన టైం వచ్చేంత వరకూ మనం ఎన్ని సార్లు ప్రయత్నించిన అది కార్యరూపం దాల్చదు. విజయ్ కుమార్ విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కి నిర్మాతల నుండి ఫాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి.

తాజా వార్తలు