నేను నా కథని నమ్ముకున్నాను

నేను నా కథని నమ్ముకున్నాను

Published on Nov 20, 2012 1:39 AM IST

చాలా మంది దర్శకులు ద్వితీయ విఘ్నం సమస్య నుండి బయటపడలేక పోతుంటే మొదటి సినిమా ఈ రోజుల్లో హిట్ తరువాత రెండవ సినిమా అంతకు మించిన హిట్ ఇచ్చి చూపించాడు మారుతి. మొదటి సినిమా విజయాన్ని తలకెక్కించుకోకుండా బస్ స్టాప్ సినిమాని రూపొందించాడు. ఈ రోజుల్లో ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పించి టికెట్ కొనించడం అంటే మాటలు కాదు. సినిమాలో బూతు ఎక్కువైందనే మాట వాస్తవమే. ఈ రోజు జరిగిన ఈ చిత్ర సక్సెస్ మీట్లో తన జ్ఞాపకాలు చెప్పుకొచ్చాడు. “ఈ సినిమా కథ నాలుగేళ్ళ క్రితం రాసుకున్నాను. ఈ కథ తీసుకుని చాలా మంది హీరోలను, నిర్మాతలను కలిసాను. కొంతమంది కథ బావుందంటే, కొందరు నువ్వు డైరెక్షన్ చేయలేవు అన్నారు. నా ఫ్రెండ్స్ కూడా నన్ను నమ్మలేదు. బెల్లంకొండ సురేష్ గారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ సినిమా ఇంతటి భారీ విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు వచ్చిన ఆదరిస్తారని నిరూపించారని” అన్నాడు.

తాజా వార్తలు