మనల్ని భయపెట్టే దర్శకుడికే భయమేసిందంట

Ram-Gopal-Varma

వైవిధ్యమైన కధాంశాలతో సినిమా రంగానికి కొత్త దారి చూపించిన సంచలనాత్మకమైన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ‘శివ’ సినిమా నుండీ ఈనాటి వరకూ క్యారెక్టర్ లోని భావోద్వేగాలే అతని కధకు ముడిసరుకులు. ఈ మధ్య అతని చిత్రాలు పరాభవం పాలయినప్పటికీ అతనిలోని వేగం ఏమాత్రం తగ్గలేదు. అతని చిత్రాలు ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా తన తదుపరి చిత్రం ‘ది ఎటాక్స్ అఫ్ 26/11′ తనకి ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందట. ఈ చిత్రాన్ని 2008లో ముంబై పై జరిగిన తీవ్రవాద దాడులు ఆధారంగా తెరకెక్కించారు.

“నేను ఇప్పటివరకూ ఇలాంటి సంఘటనని చూడలేదు. తమ పగ తీర్చుకోవడం కోసం 10 మంది కలిసి మొత్తం సిటీని అదుపులోకి తీసుకోవడం అన్న అంశం ఊహించలేం. ఆ సంఘటన జరుగుతున్న సమయంలో ప్రత్యక్షంగా చుసిన ప్రజల భావోద్వేగాలే ఈ సినిమాకు ప్రేరణ. ఈ విషయానికి సంబంధించిన చాలా సమాచారం అందించిన పోలీసులకు నా కృతజ్ఞతలు. పోలీసు వారు నాపై భారీ బాధ్యతను ఉంచారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ తీయాలి కనుక నా జీవితంలో మొదటిసారిగా నేను భయపడ్డాను. ఈ సినిమా తరువాత మానవ భాగోద్వేగాల విషయంలో నేను మరింత సున్నితంగా మారానని” వర్మ అన్నాడు.

అమర్ మొహిలే అందించిన సంగీతంలో వర్మ ఒక పాట కూడా పాడాడు. కాంతారావు ఈ ’26/11 ఇండియాపై దాడి’ సినిమాకి సమర్పకుడు. ఈ మూవీ మార్చ్ 1న రిలీజ్ అవుతుంది.

Exit mobile version