అందాల భామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా ఉంది. సౌత్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన మగధీర, తుపాకి లాంటి సినిమాల్లో నటించింది. గ్లామర్ రోల్స్ బాగానే చేస్తున్న ఈ భామ ఎక్స్ పోజింగ్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తానని అంటోంది. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ ‘ పలు విధాలుగా గ్లామర్ గా కనిపించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనం వేసుకునే బట్టలే మనల్ని హాట్ గా చూపిస్తాయి అంటే నేను నమ్మను. మరీ డ్రెస్ బాగాలేకపోతే దాన్ని మార్చమని డైరెక్టర్ ని అడుగుతానని’ అంది.
‘నాయక్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం ‘బాద్ షా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. అలాగే ‘ఎవడు’ సినిమాలో ఒక కీలక పాత్ర చేయనుంది. ఇదిలా ఉండగా కాజల్ బాలీవుడ్లో అక్షయ్ కుమార్ సరసన నటించిన ‘స్పెషల్ 26’ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది.