తన అందం మరియు నటనతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ తను ఒప్పుకున్న సినిమాలతో ఈ సంవత్సరం బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తనకి వస్తున్న ఆఫర్లకి మరియు తనకున్న డిమాండ్ విషయంలో సంతోషంగా ఉన్న కాజల్, కష్టపడి పనిచేసినప్పుడు ఫలితం తప్పకుండా ఉండాలని అంటోంది. ‘ ఒక సినిమాకి అనుకున్న దాని కంటే ఎక్కువ కష్టపడి పనిచేసినప్పుడు దానికి ఫలితం కూడా ఎక్కువగానే ఆశిస్తాను. అది ఒక్క పారితోషికం విషయంలోనే కాకుండా, ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి మన్ననలను కూడా ఎక్కువగానే ఆశిస్తాను. అప్పుడే మనం పడ్డ కష్టానికి ఒక విలువ ఉంటుందని’ ఆమె అన్నారు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో ఎన్.టి.ఆర్ సరసన ‘బాద్షా’, రామ్ చరణ్ సరసన ‘నాయక్’ మరియు రవితేజ సరసన ‘సార్ వచ్చారు’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళ్ లో నటించిన ‘బ్రదర్స్(మాట్రాన్)’ మరియు ‘తుపాకి’ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అందం, అభినయం మరియు కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వారికి విజయం వెన్నంటే ఉంటుంది.