ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు పాత్రల్లో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి పెరుతెచ్చున్న హీరో జగపతి బాబు. ప్రస్తుతం హీరోగా పెద్ద పెద్ద సినిమాల ఆఫర్లు లేకపోయినా అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూనే చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉన్నారు. ఇటీవలే విడుదలైన ‘శివతాండవం’ సినిమాలో జగపతి బాబు నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించారు. అలాగే కొత్త దర్శకులని చిన్న నిర్మాతలని ప్రోత్సహించి సినిమాలు చేసే జగపతిబాబు ఇప్పుడు ఓ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటో ఆయన మాటల్లోనే విందాం ‘ నేను ఇక నుంచి కొత్త దర్శకుడు మరియు కొత్త నిర్మాత కలిసి చేసే సినిమాలు చేయను. ఇద్దరిలో ఎవరో ఒకరు పాత వారైతేనే వారితో పని చేస్తాను. లేకుంటే చెయ్యను. కొంత మంది పెద్ద హీరో ఉంటే శాటిలైట్ రైట్స్ రేట్ కోసం నన్ను తీసుకుంటున్నారు. కొంతమందికి డెట్లు ఇచ్చి సినిమా పూర్తి చేసాక థియేటర్ల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారు సినిమా విడుదల చేస్తారా లేదా అనే ఆలోచనలో పడేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయడంలేదు. అందుకే కొత్తవారితో చేయకూడదని నిర్ణయించుకున్నానని’ ఆయన అన్నారు. ఈ విషయం చిన్న నిర్మాతలను మరియు దర్శకులను కలవరపరిచే వార్త అనే చెప్పుకోవాలి.
ఆ ఇద్దరితో సినిమా చేయ్యనంటున్న హీరో
ఆ ఇద్దరితో సినిమా చేయ్యనంటున్న హీరో
Published on Oct 8, 2012 7:31 AM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’లో మహేష్ బాబు.. తేజ సజ్జా చెప్పిన నిజం ఇదే..!
- తమిళ డైరెక్టర్స్ ఫ్లాప్ రన్ బ్రేక్ అవుతుందా ‘మురుగా’..?
- ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు కావాలంటున్న జాన్వీ కపూర్..!
- యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోబోతున్న “లిటిల్ హార్ట్స్” – బన్నీ వాస్, వంశీ నందిపాటి
- వర్మతో వంగా సరదా ముచ్చట్లు.. కూర్చోబెట్టి గుట్టు లాగిన జగపతి బాబు
- అనుష్క ‘ఘాటి’ ప్రమోషన్స్.. కనిపించకుండానే హైప్ తెస్తోంది..!
- ‘ఓజి’ కౌంట్‌డౌన్ షురూ చేసిన పవన్ కళ్యాణ్
- మిరాయ్.. ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ..!
- ఓటీటీలో సందడి చేయనున్న ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కొత్త లోక చాప్టర్ 1 చంద్ర – ఆకట్టుకునే సూపర్‌హీరో అడ్వెంచర్
- మిరాయ్.. ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ..!
- ‘అఖండ 2’ ఇండస్ట్రీ రికార్డ్స్ కొడుతుంది.. థమన్ మాస్ స్టేట్మెంట్
- ఓటిటి సమీక్ష: ‘లెక్కల మాస్టర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ పై కర్ణాటక సీఎం పోస్ట్ వైరల్
- తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ‘కల్కి 2’లో ఉన్నాడా?
- ‘ఉస్తాద్’ స్పెషల్ పోస్టర్ కోసం అంతా వెయిటింగ్!
- స్వాగ్‌లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్‌తో రచ్చరచ్చే!