ఆ ఇద్దరితో సినిమా చేయ్యనంటున్న హీరో

ఆ ఇద్దరితో సినిమా చేయ్యనంటున్న హీరో

Published on Oct 8, 2012 7:31 AM IST


ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు పాత్రల్లో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి పెరుతెచ్చున్న హీరో జగపతి బాబు. ప్రస్తుతం హీరోగా పెద్ద పెద్ద సినిమాల ఆఫర్లు లేకపోయినా అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూనే చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉన్నారు. ఇటీవలే విడుదలైన ‘శివతాండవం’ సినిమాలో జగపతి బాబు నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించారు. అలాగే కొత్త దర్శకులని చిన్న నిర్మాతలని ప్రోత్సహించి సినిమాలు చేసే జగపతిబాబు ఇప్పుడు ఓ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటో ఆయన మాటల్లోనే విందాం ‘ నేను ఇక నుంచి కొత్త దర్శకుడు మరియు కొత్త నిర్మాత కలిసి చేసే సినిమాలు చేయను. ఇద్దరిలో ఎవరో ఒకరు పాత వారైతేనే వారితో పని చేస్తాను. లేకుంటే చెయ్యను. కొంత మంది పెద్ద హీరో ఉంటే శాటిలైట్ రైట్స్ రేట్ కోసం నన్ను తీసుకుంటున్నారు. కొంతమందికి డెట్లు ఇచ్చి సినిమా పూర్తి చేసాక థియేటర్ల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారు సినిమా విడుదల చేస్తారా లేదా అనే ఆలోచనలో పడేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయడంలేదు. అందుకే కొత్తవారితో చేయకూడదని నిర్ణయించుకున్నానని’ ఆయన అన్నారు. ఈ విషయం చిన్న నిర్మాతలను మరియు దర్శకులను కలవరపరిచే వార్త అనే చెప్పుకోవాలి.

తాజా వార్తలు