బెడ్ రూమ్ సీన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు : హన్సిక

బెడ్ రూమ్ సీన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు : హన్సిక

Published on Oct 1, 2012 11:06 AM IST


బాలీవుడ్లో అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో వచ్చిన హిట్ మూవీ ‘డిల్లీ బెల్లీ’ కి రిమేక్ గా తమిళంలో ‘సెట్టై’ పేరుతో తెరకెక్కుతోంది. ఆర్య, సంతానం, ప్రేమ్ జీ అమరన్, హన్సిక మరియు అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘సెట్టై’ సినిమా మొదటి టీజర్ ని ఇటీవలే విడుదల చేసారు. ఈ టీజర్లో ఆర్య మరియు హన్సిక మధ్య బెడ్ సీన్స్ ఉండడంతో సినిమాలో మంచి హాట్ బెడ్ రూమ్ సీన్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై హన్సిక ఘాటుగా స్పందించారు. ‘ ప్రస్తుతం నా కెరీర్ ఉన్న జోరుకి నాకు బెడ్ రూమ్ సీన్స్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మరియు సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు ఉండవని’ హన్సిక అన్నారు. హిందీ వెర్షన్లో ఎంటర్టైనింగ్ తో పాటు అడల్ట్ అంశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇందులో అలాంటివి ఏమీ లేవనడం ప్రేక్షకులను కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం హన్సిక తెలుగులో మంచు విష్ణు సరసన నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు