అదేమీ తప్పు కాదంటున్న కొత్త డైరెక్టర్.!

అదేమీ తప్పు కాదంటున్న కొత్త డైరెక్టర్.!

Published on Nov 18, 2012 11:43 AM IST


‘ఈ రోజుల్లో’ మరియు ‘బస్ స్టాప్’ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న డైరెక్టర్ మారుతి. మారుతి డైరెక్షన్ లో ఇటీవలే విడుదలైన ‘బస్ స్టాప్’ సినిమాకి కొంత మంది నుంచి చెడు విమర్శలు వస్తున్నాయి. సినిమా బాగా లేదని, బూతులు ఎక్కువగా పెట్టి బూతు సినిమా తీసాడు అనే విమర్శలు వస్తున్నాయి. వీటిపై మారుతి స్పందిస్తూ ‘ టీనేజ్ లో ఉండే వారికి ఎప్పుడైతే ప్రేమ అనే ఆలోచన పలకరిస్తుందో అప్పటి నుంచి తల్లి తండ్రులకు అబద్దాలు మరియు వారికి దూరం అవుతారు. రోజు రోజుకి మనకు టెక్నాలజీ పెరుగుతోంది కానీ దాని వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతకన్నా ఎక్కువ ప్రమాదం కూడా ఉంది. అందరూ సినిమా వల్గర్ గా ఉందని అంటున్నారు కానీ వాటి గురించి తెలిసిన వారు మాత్రం నిజమే కదా అంటున్నారు. అది అర్థం కాని వారు బూతు సినిమా అంటున్నారు. అలాగే బూతేమీ తప్పు కాదు బూతు కూడా ఒక మనలోని భావమే. నేను బూతు సినిమా తీయాలి అనుకోని ఉంటే హీరోయిన్స్ ని వల్గర్ గా మరియు లిప్ కిస్ లు పెట్టేవాన్ని కానీ నేను ఎక్కడా అలా చూపించలేదు. ఈ సినిమాలో నేను యువతకి బాగా తిండి పెట్టి, వాతలు పెడితే ఎలా ఉంటుందో అలా చేసానని’ అన్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

తాజా వార్తలు