అలాంటివి నమ్మనంటున్న అంజలి.!

అలాంటివి నమ్మనంటున్న అంజలి.!

Published on Dec 30, 2012 5:40 PM IST

Anjali-in-SVSC
ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీగా మారుతున్న టాలెంటెడ్ హీరోయిన్ అంజలి స్వతహాగా అచ్చమైన తెలుగమ్మాయి. కానీ ఈ భామకి ముందు తమిళంలో బ్రేక్ వచ్చింది ఆ తర్వాత తెలుగు నిర్మాతలు గుర్తించారు. ప్రస్తుతం అంజలి విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా సీత అనే పాత్రలో కనిపించనుంది. వెంకటేష్ కి జోడీ కోసం దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల చాలా మంది హీరోయిన్స్ ని అనుకోగా వాళ్ళెవరూ సముఖత వ్యక్తం చేయకపోవడంతో అప్పుడే ‘జర్నీ’ సినిమా విడుదలై క్రేజ్ ఉన్న అంజలిని అడగడంతో ఆమె ఒప్పుకుంది.

ఇటీవలే అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడి సరసన నటించడానికి ఎందుకు అంగీకరించారు? అని అడిగిన ప్రశ్నకు ‘ ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నటీనటుల మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్స్ బాగుండాలి అని చెప్పుకునే విషయాన్ని నేను నమ్మను. సీనియర్ నటులతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని’ అంజలి అంది.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రోమోస్ లో అంజలి తన లుక్ తో అందరినీ ఆకర్షించింది. ఈ సినిమా కాకుండా అంజలి ప్రస్తుతం రవితేజ సరసన ‘బలుపు’ సినిమాలో నటిస్తోంది. ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్రని పోషిస్తోంది. ఇవి కాకుండా తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది అందులో విశాల్ సరసన ‘మధ గజ రాజా’, ‘ఢిల్లీ బెల్లీ’ రీమేక్ ‘సెట్టై’ కూడా ఉన్నాయి.

తాజా వార్తలు