అరుంధతి ముందు వరకు నాకు నటించడం రాదు – అనుష్క

అరుంధతి ముందు వరకు నాకు నటించడం రాదు – అనుష్క

Published on Dec 22, 2012 7:44 PM IST

Anushka-1
పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చే నటీమణులలో అనుష్క ఒకరు “అరుంధతి” చిత్రం నుండి ఆమె నటనలో మరింత పరిపక్వత కనిపించింది.కోడి రామ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఆమె కెరీర్ లో ఒకానొక భారీ విజయం సాదించిన చిత్రంగా ఇది నిలిచింది. “నేను అరుంధతి చిత్రాన్ని ఒప్పుకున్నప్పుడు నాకు నటించడం వచ్చని నాకు తెలియదు. దర్శకుడు మరియు శ్యాం ప్రసాద్ రెడ్డి వల్లనే నేను ఆ ప్రదర్శన ఇవ్వగలిగాను” అని అన్నారు. త్వరలో రాబోతున్న “రుద్రమ దేవి” చిత్రం ఈమె చెయ్యబోతున్న తరువాత సోలో చిత్రం ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇప్పటికే అనుష్క శిక్షణ తీసుకోడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం 2013 ఏప్రిల్ లో మొదలు కానుంది. ఈ మధ్యనే ఈ నటి నాగార్జున సరసన “డమరుకం” చిత్రంలోకనిపించారు. ప్రస్తుతం “మిర్చి” చిత్రం కోసం వేచి చూస్తున్న ఈ భామ తమిళంలో “అలెక్స్ పాండియన్”, “ఇరండాం ఉలగమ్” మరియు “సింగం 2” చిత్రాలతో 2013లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

తాజా వార్తలు