ఒక్క షాట్ కోసం 78 టేకులు తీసుకున్న అల్లరోడు

ఒక్క షాట్ కోసం 78 టేకులు తీసుకున్న అల్లరోడు

Published on May 26, 2013 2:05 PM IST

Allari-Naresh-shooting-at-G
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాకి ‘యాక్షన్ 3డి’. ఈ సినిమాపై అల్లరి నరేష్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఇండియాలోనే వస్తున్న ఈ మొట్టమొదటి కామెడీ 3డి చిత్రానికి అనీల్ సుంకర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు శ్యాం, వైభవ్, రాజు సుందరం, నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్, షీన, కామ్న జఠ్మలాని, రీతు బర్మీచలు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ‘ఈగ’ చిత్రంతో పరిచయమైన సుదీప్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో 3డి సినిమా తీయడం ఎంత కష్టమో నరేష్ చెప్పాడు. ఒక షాట్ కోసం 78 రీటేకులు తీసుకున్నానని చెప్పాడు.

‘3డి కెమరాలో జూమ్ చేసుకునే అవకాశం ఉండదు. క్లోజ్ షాట్ కోసం మేము కెమెరాకి మూడు అడుగుల దూరంలో మాత్రమే ఉండాలి. ఒక యాక్షన్ షాట్ కోసం నేను 78 టేకులు తీసుకున్నాను. నేను 6 అడుగులు జంప్ చేసి ఒక పంచ్ ఇవ్వాలి. ఆ పంచ్ ఇచ్చే షాట్ కెమెరాకి 3 అడుగుల దూరంలో ఉంటుంది. ఆ ఒక్క సింగల్ షాట్ కోసం రాత్రి 8 నుంచి పొద్దున 6 వరకూ షూట్ చేసామని’ అల్లరి నరేష్ తెలిపాడు. బప్పి – బప్పా లహరి సంగీతం అందించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా జూన్ 7వ తేదీన విడుదల కానుంది.

తాజా వార్తలు