సరైన సమయంలోనే నేను బ్రేక్ తీసుకున్నాను.!

సరైన సమయంలోనే నేను బ్రేక్ తీసుకున్నాను.!

Published on Nov 18, 2012 1:58 PM IST

https://cdn.123telugu.com/content/wp-content/uploads/2012/01/genelia.jpg
అందాల భామ జెనిలియా డిసౌజా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు, ఆ తర్వాత ఒక్క కొత్త సినిమాకి కూడా అంగీకారం తెలుపలేదు. ఈ విషయం పై జెనీలియా స్పందిస్తూ ‘ నేను చాలా చిన్న వయస్సులోనే నేను నా సినీ కెరీర్ ని ప్రారంభించాను మరియు పది సంవత్సరాలు గ్యాప్ లేకుండా పని చేసాను. అలాగే నేను ఐదు భాషల్లో హీరోయిన్ గా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సరియన సమయంలోనే పెళ్లి చేసుకొని బ్రేక్ తీసుకున్నాను మరియు ఈ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని’ అంది. జెనీలియా పెళ్ళికి ముందు రానా సరసన ‘నా ఇష్టం’ అనే సినిమాలో నటించింది మరియు అలాగే కొన్ని హిందీ సినిమాల్లో నటించారు కానీ అవి ఇంకా విడుదల కాలేదు.

తాజా వార్తలు