ఈ కాలపు సంగీత దర్శకులలో వరుస విజయాలను అందిస్తూ బిజీబిజీగా సాగుతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. కానీ ఆయన ఇంత రసరమ్యమైన సంగీతాన్ని అందించగలిగే శక్తిని ఇచ్చిన గురువుగారి పేరు మాండలిన్ శ్రీనివాస్ అని అతి కొద్దిమందికే తెలుసు. ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను నా 3వ తరగతిలోనే మాండలిన్ శ్రీనివాస్ గారి దగ్గర విధ్యాభ్యాసంకోసం చేరాను. ఆయన నన్ను ఒక శిష్యుడిగా కంటే స్నేహితుడిగా దరికి చేర్చుకున్నారు. సంగీతమే కాక మరెన్నో విషయాలు నేర్పారు. నేను ఈ ప్రపంచంలో ఎవరిదగ్గరన్నా మాట్లాడగలను కానీ ఆయన ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేను. అది ఆయన మీద నాకున్న గౌరవం” అని తెలిపారు
దేవీకు చాలా కోరికలు వున్నాయట. అందులో తన గురువుగారితో తాను కంపోజ్ చేసిన బాణీ ఒకటి వాయించుకోవాలని కోరికట. ఇటీవలే ఆయన దేవీ స్వరపరిచిన ‘కెవ్వు కేక’ పాట నచ్చిందని చెప్పడంతో మన డి.ఎస్.పి చాలా హ్యాపీగా వున్నాడు