నాకు పేస్ బుక్ ఎకౌంటు లేదు -శృతి హాసన్

నాకు పేస్ బుక్ ఎకౌంటు లేదు -శృతి హాసన్

Published on Oct 11, 2012 8:32 PM IST


తనకి ఎటువంటి పేస్ బుక్ ఎకౌంటు లేదని శృతి హాసన్ ధ్రువీకరించారు.”నాకు పేస్ బుక్ లో ఎటువంటి ఎకౌంటు లేదు అవి ఫేక్ ఎకౌంట్లు” అని ఈరోజు శృతి హాసన్ అన్నారు ఈ మధ్య కాలం లో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చాలామంది ప్రముఖుల పేరుతో ఎకౌంట్లను సృష్టించి పలువురిని మోసం చేస్తున్నారు.ఈ మధ్యనే దర్శకుడు వంశీ పైడిపల్లి పేరు మీద ట్విట్టర్లో మరియు పేస్ బుక్ లో ఎకౌంటులను సృష్టించి జనాన్ని మోసం చేసారు ఈ విషయమయి వంశీ ఫిర్యాదు నమోదు చేశారు.గత రెండు నెలలుగా శృతి హాసన్ ప్రభు దేవ దర్శకత్వంలో గిరీష్ తౌరని హీరోగా “నువ్వొస్తానంటే నేనోద్దంటానా ” హిందీ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు.రవితేజ సరసన “బలుపు” అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తన్నారు .

తాజా వార్తలు