నేను ఫాస్ట్ గా సినిమాలు తీయట్లేదు

నేను ఫాస్ట్ గా సినిమాలు తీయట్లేదు

Published on Oct 9, 2012 1:38 PM IST


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన డైలాగ్స్ తో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించడమే కాదు, ఆయన మాట తీరు కూడా అదే విధంగా ఏ మాత్రం తడబాటు లేకుండా అంతే సూటిగా ఉంటుంది. పూరి జగన్నాథ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్ర విశేషాలు తెలియజేయడం కోసం ఈ రోజు ఆయన ఆఫీస్ లో మీడియా వారితో సమావేశమయ్యారు. ఈ చిత్రాన్ని ఈ నెల 18 విడుదల చేయనున్నామని తెలియజేసారు.

ఈ సమావేశంలో ఒకరు మీరు టాప్ హీరోలతో చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబుతో చేసారు ఇప్పుడేమో పవన్ తో అంతే ఫాస్ట్ గా సినిమా చేసేసారు. ఈ విషయంలో మీ సీక్రెట్ ఏంటి? అని అడగగా దానికి పూరి ఇలా సమాధానమిచ్చారు. ‘ నేను ఫాస్ట్ గా షూటింగ్ చేయడం లేదు, ఇతర దర్శకులు నిధానంగా షూటింగ్స్ చేయడం వల్ల మీకు అలా అనిపిస్తోంది. మా సినిమా కోసం నాకు అంత సమయం అవసరం లేదని’ ఆయన అన్నారు. ఈ విషయానికి మన దర్శకులు ఏమంటారో చూడాలి. కానీ మన టాలీవుడ్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సినిమాలు తీయడానికి చాలా సమయం పడుతుంది.

తాజా వార్తలు