నేను బూచోడిని : వర్మ

నేను బూచోడిని : వర్మ

Published on Oct 10, 2012 1:00 PM IST


‘రామ్ గోపాల్ వర్మ చేసిన తాజా నిర్వాకం బూచి’ ఈ మాటలు అన్నది మరెవరో కాదు, వర్మే. అవును ఈ మాటలు అన్నది వర్మే. అయన తీసిన తాజా చిత్రం బూచి గురించి మాట్లాడుతూ. ‘బూచి సినిమాని 3డి ఫార్మాట్లో తీసాము. ఇది పిల్లలని భయపెట్టడానికి తీసిన సినిమా కాదు. నాకు దేవుడి మీద కంటే దెయ్యం మీదే నమ్మకం ఎక్కువ. ఎందుకంటే దేవుడు కనపడలేదు కానీ, దెయ్యం చేసే శబ్దాలు నాకు వినిపించాయి. నేను బూచోడిని. పిల్లలు దేవుడి తో సమానం అంటే నేను నమ్మను. 1930 నుండి వస్తున్న ప్రతి హార్రర్ సినిమాలోనూ అదే కథ ఉంటుంది. దెయ్యం సినిమా తీస్తున్నంత మాత్రాన సినిమా తీసేటప్పుడు నేను భయపడాలని లేదు’ అన్నారు. బూచి 3డి ఫార్మాట్లో అక్టోబర్ 12న విడుదల కాబోతుంది.

తాజా వార్తలు