ప్రభాస్ ‘మిర్చి’ టికెట్లకి ఫుల్ క్రేజ్

ప్రభాస్ ‘మిర్చి’ టికెట్లకి ఫుల్ క్రేజ్

Published on Feb 6, 2013 10:42 AM IST

Mirchi2
2013లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఒక్కటి మాత్రమే విడుదలవుతుంది. అవును ఈ సంవత్సరం ప్రభాస్ సినిమాల్లో మిర్చి ఒక్కటే విడుదలవుతుంది. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న బాహుబలి షూటింగ్ దాదాపు సంవత్సరం పైనే పట్టనుంది. ప్రభాస్ సినిమాలు దగ్గరలో ఏవి ఉండకపోవడంతో మిర్చి పై క్రేజ్ బాగా ఉంది. ప్రభాస్ ఫాన్స్ ఈ సినిమాని పండగలా చేస్కోవాలని భావిస్తున్నారు. ఈ సినిమా టికెట్స్ కి కూడా క్రేజ్ బాగా ఉంది. ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంటి ధియేటర్లలో టికెట్స్ కోసం ఫోన్స్ చేసి బుక్ చేసుకుంటుండగా ఫాన్స్ షో లకి క్రేజ్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో బాగా సక్సెస్ కావడంతో ఓపెనింగ్స్ కూడా బావుంటాయని ఆశిస్తున్నారు చిత్ర బృందం.

తాజా వార్తలు