యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. ప్రభాస్ నుంచి చాలా కాలం నుంచి వస్తున్న సినిమా అందులోనూ ఒక ప్యూర్ లవ్ స్టోరీ కావడంతో దీనిపై ప్రభాస్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇంకా అలాగే ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారని తెలియడంతో దీనిపై భారీ వ్యయం తప్పనిసరి అని కన్ఫర్మ్ అయ్యింది.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను అంతే ఖర్చుతో ప్లాన్ చేశారు. అయితే ఏవేవో సీక్వెన్స్ లు వరకు ఎందుకు కానీ ఇటీవలే బయటకొచ్చిన మోస్ట్ అవైటెడ్ టీజర్ గ్లింప్స్ లోనే చూసిన ఓ సెట్ కు భారీ ఖర్చు చేశారట తెలుసా.? ఈ గ్లింప్స్ లో ఫస్ట్ ఓ లాంగ్ షాట్ లోనే ఒక రెట్రో ట్రైన్ ను చూపిస్తారు. తర్వాత క్లోజప్ షాట్ లో ఈ ఇదే ట్రైన్ ను చూపిస్తారు. మరి ఆ ఒక్క ట్రైన్ సెట్ కోసమే మేకర్స్ ఏకంగా 1.6 కోట్లు ఖర్చు చేశారట.
దీనికే ఇలా అంటే ఇంకా మిగతా సినిమా అంతా ఎంతెంత పెట్టి ఉంటారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ టీజర్ కూడా వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది మరి అందులో ఎలాంటి విజువల్స్ ను చూపిస్తారో చూడాలి. మొత్తానికి మాత్రం యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాకి ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి.