డైరెక్టర్ పరశురామ్ ఇప్పటికి చేసింది ఆరు సినిమాలు. అందులో ‘సోలో’ హిట్ కాగా ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రవితేజ హీరోగా ఆయన చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఆంజనేయులు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మళ్ళీ రవితేజ హీరోగా సారొచ్చారు సినిమా చేయగా అది కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. మిగతా రెండు ఆయన యంగ్ హీరోలతో చేసిన యూత్ ఫుల్ మూవీస్.
కమర్షియల్ సబ్జక్ట్స్ తో ఆయన తెరకెక్కించిన రెండు చిత్రాలు ఫలితం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మహేష్ తో ఆయన చేయనున్న మూవీ జోనర్ ఏమై ఉంటుందనే ఆసక్తి కలుగుతుంది. మహేష్ అంటే మాస్ కమర్షియల్ తో సినిమా చేయాల్సి ఉంటుంది. ఎమోషన్స్ సంగతి ఎలా ఉన్న, కమర్షియల్ అంశాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. మహేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా పరుశురామ్ ఎలాంటి సబ్జెక్టు సిద్ధం చేశాడన్నది ఆసక్తికర అంశం. మరి చూడాలి ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేయనున్న పరుశురాం ఎలా సినిమా తెరకెక్కిస్తారో.