సమీక్ష : హౌస్‌ఫుల్ 5 – రొటీన్ టెంప్లేట్ అయినా కామెడీ వర్కవుట్ అయింది!

సమీక్ష : హౌస్‌ఫుల్ 5 – రొటీన్ టెంప్లేట్ అయినా కామెడీ వర్కవుట్ అయింది!

Published on Jun 6, 2025 7:05 PM IST

Housefull 5

విడుదల తేదీ : జూన్ 06, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పడే, నానా పటేకర్, డీనో మోరియా తదితరులు
దర్శకుడు : తరుణ్ మన్సుఖాని
నిర్మాత : సాజిద్ నడియాడ్‌వాలా
సంగీతం : జూలియస్ పాకియమ్, యో యో హనీ సింగ్, తనిష్క్ బాగ్చీ తదితరులు
సినిమాటోగ్రఫీ : వి.మణికందన్
ఎడిటింగ్ : రామేశ్వర్ ఎస్.భగత్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాల ఫ్రాంచైజీల్లో ‘హౌస్‌ఫుల్’కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’ నేడు వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
ఈ సినిమా కథ మొత్తం ఓ లగ్జరీ క్రూజ్ షిప్‌లో సాగుతుంది. బిలియనీర్ అయిన రంజీత్(రంజీత్) మృతితో అతని ఆస్తి మొత్తం తన రెండో భార్య కుమారుడు జాలీకి చెందాలని తన వీలులో రాస్తాడు. దీంతో తన మొదటి భార్య కుమారుడు దేవ్(ఫర్దీన్ ఖాన్)తో పాటు పలువురు బోర్డ్ మెంబర్స్ ఈ ఆస్తి కోసం ఎలాంటి ప్లాన్ చేస్తారు..? తానే జాలీ అంటూ క్రూజ్ షిప్‌లోకి వచ్చిన అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్ ఎవరు..? ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి..? క్రూజ్ షిప్‌లో జరిగే హత్యలు ఎవరు చేస్తారు..? ఇంతకీ అసలు జాలీ ఎవరు..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
‘హౌస్‌ఫుల్’ సినిమాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ సినిమాలోని క్యాస్టింగ్ చూస్తే అర్థమవుతుంది. ఓ భారీ క్రూజ్ షిప్‌లో ఇంత మంది నటీనటులు కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కథ రొటీన్ టెంప్లేట్‌తో తెరకెక్కించినా, కామెడీ జోనర్‌తో తెరకెక్కడంతో ఇది ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యింది.

ఇక కన్ఫ్యూజన్ కామెడీతో ఈ సినిమా కథను ముందుకు తీసుకెళ్లిన తీరు వర్కవుట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో స్లో పేస్ కొంతవరకు విసిగించినా, ఆ తర్వాత కథ ట్రాక్ ఎక్కడంతో ప్రేక్షకులు సినిమాలో లీనమవుతారు. అయితే, పాత్రల పరిచయాలు మొదలుకొని, కామెడీ సీన్స్, కథలోని ట్విస్టుతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది.

అటు సెకండాఫ్‌లో సస్పెన్స్, కామెడీ సినిమా మొత్తం క్యారీ అవడంతో ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే బిగ్ సర్‌ప్రైజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంతమంది నటీనటులు నటించిన సినిమా అయినప్పటికీ, వారి పాత్రలను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్ :
ఇలాంటి రొటీన్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు స్క్రీన్ ప్లే పక్కాగా ఉంటే దాని ఫలితం వేరేగా ఉంటుంది. ఈ సినిమాలోని అది మనకు మిస్ అయినట్లు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోని స్లో పేస్, సెకండ్ హాఫ్‌లోని ల్యాగ్ సీన్స్ ప్రేక్షకులను విసిగిస్తాయి. అయితే, తరుచుగా వచ్చే కామెడీ సీన్స్ వాటిని మర్చిపోయేలా చేస్తాయి.

ఇక ఈ సినిమాలో ఇంతమంది నటీనటులు ఉండటం బాగున్నా, వారి పాత్రల డిజైన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. చాలా మంది ఆర్టిస్టులను వేస్ట్ చేశారని అనిపిస్తుంది. ముఖ్యంగా సీనియర్ యాక్టర్స్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అనిపిస్తుంది. సంగీతం పరంగా సాంగ్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి.. కానీ వాటి టైమింగ్ తేడా కొట్టింది. కొన్ని చోట్ల కామెడీ సీన్స్‌ను బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు తరుణ్ మన్సుఖాని ఈ చిత్రాన్ని, ఇంతమంది క్యాస్టింగ్‌ను హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. కానీ, ఆయన అవుట్‌పైట్‌పై మరికొంత ఫోకస్ పెట్టి ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్‌గా ఉండేది. సాజిద్ నడియాడ్‌వాలా స్క్రీన్‌ప్లే ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. ఇక ఎడిటింగ్ పనితనం చాలా సీన్స్‌లో మెరుగ్గా ఉండాల్సింది అనిపిస్తుంది. సంగీతం పరంగా కొన్ని సాంగ్స్ ఆకట్టుకుంటాయి. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.

తీర్పు :
ఓవరాల్‌గా.. ‘హౌస్‌ఫుల్ 5’ మూవీ ఓ రొటీన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయింది. భారీ క్యాస్టింగ్, ఆకట్టుకునే ట్విస్టులు, సర్‌ప్రైజింగ్ కేమియోలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. రొటీన్ కథ, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్. కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఓసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు