‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న బడ్జెట్ సినిమాలో కొత్త ఎలిమెంట్స్ ను జోడించి మంచి హిట్ ను అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’. అయితే ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ తన రెండో చిత్రంగా రానాని హీరోగా పెట్టి ‘విరాటపర్వం’ అనే పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలుంది. త్వరలోనే ఆ షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ఇక ఈ చిత్రానికి కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచెర్ ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లకు రూపకల్పన చేశారు. అలాగే హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
కాగా తెలంగాణ ప్రాంతంలోని 1980 – 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాను దర్శకుడు రాసుకున్నాడట. అంటే అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారనుకుంటా. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తున్నాడట. ఈ చిత్రంలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ నటి నందితా దాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.