భీష్మ చిత్రంతో భారీ హిట్ అందుకున్న నితిన్ వరుసగా నాలుగు చిత్రాలు లైన్ లో పెట్టాడు. వాటిలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ఒకటి. పవర్ పేట అనే టైటిల్ లో తెరకెక్కనున్న ఈ మూవీ స్క్రిప్ట్ పై కృష్ణ చైతన్య రెండేళ్లుగా వర్క్ చేస్తున్నాడు. నితిన్ కెరీర్ లోనే నిలిచి పోయేలా ఆ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమాలో నితిన్ మూడు విభిన్నమైన వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడట. 20 ఏళ్ల కుర్రాడిగా 40 ఏళ్ల మద్య వయస్కుడిగా 60 ఏళ్ల వృద్దుడిగా కనిపించనున్నాడట. దీని కోసం ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టును తీసుకోనున్నారట. బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించనున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాను నితిన్ స్వయంగా నిర్మించేందుకు ఆలోచనలో ఉన్నారు.