నాని నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘హిట్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్ర దర్శకుడు శైలేష్ కొలనుకు ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. నిర్మాత నాని సైతం శైలేష్ తన నమ్మకాన్ని నిలబెట్టింనందుకు సంతృప్తిఅవకాశం గా ఉన్నారు. ఇక శైలేష్ కొలను అయితే నెక్స్ట్ ‘హిట్ 2’ తీస్తానని అంటూనే అవకాశం వస్తే నానిని కూడా డైరెక్ట్ చేస్తానని మనసులో మాట బయటపెట్టారు.
స్వతహాగానే నానికి యంగ్ టాలెంట్ మీద గురి ఎక్కువ. మంచి కథతో వస్తే కొత్తవారైనా సరే కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపుతుంటారు నాని. అలాంటిది తన నిర్మాణంలోనే దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్న, తనతో సినిమా చేయాలని ఆశపడుతున్న శైలేష్ కొలనుకు ఆయన సినిమా ఇచ్చే అవకాశం లేకపోలేదు. కానీ ప్రజెంట్ నాని ‘వి, టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్’ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇవన్నీ పూర్తయి నానికి ఖాళీ దొరకాలంటే నెక్స్ట్ ఇయర్ అవుతుంది. మరి వచ్చే యేడాది నానితో సినిమా చేయాలనే శైలేష్ కొలను కోరిక తీరుతుందేమో చూడాలి.