HIT 3 Box-Office: వరల్డ్ వైడ్ ‘హిట్ 3’ రెండు రోజుల వసూళ్లు!

HIT 3 Box-Office: వరల్డ్ వైడ్ ‘హిట్ 3’ రెండు రోజుల వసూళ్లు!

Published on May 3, 2025 2:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రమే “హిట్ 3”. నాచురల్ స్టార్ నాని హీరోగా తాను పరిచయం చేసిన దర్శకుడే శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి భారీ వసూళ్లు ఇపుడు అందుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా హిట్ 3 చిత్రం భారీ వసూళ్లు అందుకుంటుండగా రెండు రోజుల రన్ ని అయితే పూర్తి చేసుకుంది.

మరి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 40 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం రెండో రోజు అది కూడా వర్కింగ్ డే సాలిడ్ నంబర్స్ అందుకుంది. ఇలా డే 2 కి గాను 20 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. దీనితో మొత్తం రెండు రోజుల్లో హిట్ 3 చిత్రం 62 కోట్లకి పైగా అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక మూడో రోజు కూడా ఆల్రెడీ సాలిడ్ బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అవుతుండగా ఈ శనివారం ఆదివారం కూడా మళ్ళీ డబుల్ డిజిట్ నంబర్స్ నమోదు కావడం ఖాయం అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు