పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డే నటించబోతుందని ఈ మధ్య సోషల్ మీడియాలో తరుచుగా వార్తలు వస్తున్నాయి. అయితే హరీష్ శంకర్ దృష్టికి ఈ వార్త వెళ్లడంతో.. ఆయన అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చారట. ఇంకా స్క్రిప్ట్ పూర్తి కాలేదని స్క్రిప్ట్ అయ్యాకే హీరోయిన్ ఎవరని డిసైడ్ అవుతుందని హరీష్ తెలిపారట.
ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఏ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ యేడాది ఆఖరులో విడుదలకానుంది. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.