తమిళ్ హీరో ఆర్య వైఫ్ సయేశా క్వారంటైన్ టైంలో వరుస డాన్స్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ని ఫిధా చేస్తుంది. కొద్దిరోజుల క్రితం సయేశా గ్రేసింగ్ స్టెప్స్ తో ఓ డాన్స్ వీడియో చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేడు సయేశా ఓ క్లాసిక్ సాంగ్ కి శాస్త్రీయ నృత్యం చేసి అలరించింది. దానికి సంబందించిన వీడియో ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో సయేశా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆసక్తిగా ఉన్నాయి.
సయేశా టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీగా వచ్చిన అఖిల్ సినిమాలో ఈమె నటించింది. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కెరీర్ బిగినింగ్ లోనే తమిళ్ హీరో ఆర్యను ఈమె ప్రేమ వివాహం చేసుకుంది. సయేశా వయసు కేవలం 22 కాగా ఆర్య వయసు 39 ఏళ్ళు. ఇక వివాహం తరువాత ఈమె సినిమాలలో నటించడం కొంచెం తగ్గించారు. ఆమె నటిస్తున్న రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇటీవల సూర్య హీరోగా వచ్చిన బందోబస్త్ సినిమాలో సయేశా హీరోయిన్ గా నటించింది.
Shooting blues! ???? making up for it at home ???? pic.twitter.com/H9GFtZhFSf
— Sayyeshaa (@sayyeshaa) May 15, 2020