‘6 టీన్స్’ రోహిత్ హీరోగా కొత్త చిత్రం మొదలు

6-Teens
గర్ల్ ఫ్రెండ్, 6 టీన్స్ వంటి చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రోహిత్ ఆ తరువాత అడపాదడపా చిత్రాలు చేసినా విజయం దక్కించుకోలేక పోయాడు చివరగా అతను “నవ వసంతం” చిత్రంలో కనిపించారు. తాజాగా అయన మరో చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నారా బిందు పవన్ కుమార్ నిర్మిస్తున్నారు సాఫ్ట్ వెర్ నేపధ్యంలో సాగే ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది ఈ చిత్రానికి దర్శకుడు తిరుపతి కిరణ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. సాకేత్ సాయి రామ్ సంగీతం అందించగా సిరి, కావ్యసింగ్, అభిషేక్ తదితరులు ముఖ్యభూమికలు పోషిస్తున్నారు.

Exit mobile version