“ప్రజా శ్రేయస్సు కోసం” హీరో రామ్ ట్వీట్.!

“ప్రజా శ్రేయస్సు కోసం” హీరో రామ్ ట్వీట్.!

Published on Aug 16, 2020 3:04 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో “రెడ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత కూడా కొన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టుకున్న ఈ హీరో నుంచి ఇప్పుడు ఊహించని విధమైన ట్వీట్స్ పడుతున్నాయి. నిన్నటి నుంచి ఒక్కసారిగా రామ్ ట్విట్టర్ ఖాతా ద్వారా పలు సంచలన ట్వీట్లు పడిన అనంతరం ఇప్పుడు మరో ఆసక్తికర ట్వీట్ ను పెట్టారు.

అయితే ఇదేమి పొలిటికల్ గా టార్గెట్ చేసింది కాదు. కేవలం అవగాహన కోసమే చేసినట్టు అనిపిస్తుంది. “ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం..!” అని చెప్తూ “ఆర్ టి – పిసిఆర్ టెస్టు చేయించుకున్న‌ప్పుడు కుటుంబంలో 10 మందిలో 8 మందికి నెగ‌టివ్ వ‌చ్చినా స‌రే, CT SCANలో కోవిడ్ ఉన్న‌ట్టు గ‌మ‌నిస్తే, వెంట‌నే వారిని ఆసుప‌త్రుల్లో చేర్పించండి. అలాంటి వారు సైలెంట్‌గా స్ప్రెడ్ చేయ‌డంవ‌ల్ల ఇత‌రులు ప్ర‌మాదంలో ప‌డ‌తారు.” అని ట్వీట్ చేసి అవగాహన కల్పించే విధంగా తెలిపారు.

తాజా వార్తలు