గోపి చంద్ అంత పెద్ద సాహసం చేస్తాడా..?

గోపి చంద్ అంత పెద్ద సాహసం చేస్తాడా..?

Published on Mar 6, 2020 9:49 AM IST

హీరోగా తొలివలపు సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన గోపించంద్ ఆ చిత్రం పరాజయం పొందడంతో రెండో సినిమాకే విలన్ అవతారం ఎత్తాడు. దర్శకుడు తేజా తెరకెక్కించిన జయం, నిజం చిత్రాల్లో గోపి చంద్ వేసిన విలన్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. విలన్ గా వరుస అవకాశాలు అందుకుంటున్న తరుణంలో యజ్ఞం సినిమాతో మరోమారు హీరోగా ప్రయత్నించాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో కూడిన లవ్ స్టోరీ గా వచ్చిన యజ్ఞం సూపర్ హిట్ కావడంతో హీరోగా మొదటి విజయం అందుకున్నాడు.

రణం,లక్ష్యం,శౌర్యం వంటి సినిమాలు గోపి చంద్ ని యాక్షన్ హీరోగా నిలబెట్టాయి. ఈ మధ్య విజయాల పరంగా వెనుకబడ్డ గోపించంద్ మళ్ళీ విలన్ గా మారనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. రజిని కాంత్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో విలన్ గా గోపి చంద్ నటిస్తున్నాడట. పూణే లో జరగనున్న షెడ్యూల్ నందు ఆయన పాల్గొననున్నాడట. ఐతే గోపిచంద్ మళ్ళీ విలన్ గా మారడానికి సాహసం చేస్తాడా అనేదే పాయింట్. ఎంతో కస్టపడి హీరోగా నిలదొక్కుకున్న గోపి చంద్, మంచి కథలు ఎంచుకుంటే విజయం అంత కష్టం కాదు. గోపి చంద్ మార్కెట్ కూడా మరీ దారుణంగా ఏమి పడిపోలేదు. ఈ సారి విలన్ గా మారితే గోపించంద్ మరలా హీరో అవడం అనేది కష్టం.

తాజా వార్తలు