ఉమెన్స్ డే పవన్ పర్ఫెక్ట్ గిఫ్ట్..మగువా మగువా సాంగ్.

ఉమెన్స్ డే పవన్ పర్ఫెక్ట్ గిఫ్ట్..మగువా మగువా సాంగ్.

Published on Mar 8, 2020 10:49 AM IST

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న వకీల్ సాబ్ మే లో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ నేడు ఉమెన్స్ డే కానుకగా విడుదల చేశారు. మగువా మగువా.. అనే ఈ లిరికల్ సాంగ్ ఆడవారి గొప్పతనం తెలిపేదిగా ఉంది. ఆడవాళ్ళ సహనం, తెగువ, ధైర్యం, త్యాగం వంటి లక్షణాలు తెలియజేస్తూ మంచి సాహిత్యంతో సాగింది.

ఈ సాంగ్ కి టాలీవుడ్ ఏస్ లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ పాడారు. వకీల్ సాబ్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఇక బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు