ఆకట్టుకొనేలా సాగిన భీష్మ సరా సరి… సాంగ్.

నితిన్, రష్మిక మందాన జంటగా తెరకెక్కిన చిత్రం భీష్మ. ఈ మూవీ ఈనెల 21న విడుదల కానుంది. దర్శకుడు వెంకీ కుడుముల రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా భీష్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు ఈ మూవీ నుండి సరా సరి… అనే సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. అమ్మాయి అందం, ప్రేమ అబ్బాయిని ఎంతలా మార్చేసిందో తెలుపుతూ సాగిన సరా సరి సాంగ్ ఆకట్టుకుంది. ముఖ్యంగా పాట నేపథ్యంలోని పల్లెటూరి వాతావరణం చాల బాగుంది.

సందర్భానికి తగ్గట్టుగా శ్రీ మణి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి ఆహ్లాదంగా పాడారు. భీష్మ చిత్రంతో మొదటిసారి రష్మిక, నితిన్ సరసన నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీష్మ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ తెరపై కనిపించి దాదాపు ఏడాదిన్నర అవుతుండగా ఆయన ఫ్యాన్స్ ఎంతగానో భీష్మ కోసం ఎదురుచూస్తున్నారు.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version