డిసెంబర్ 8న విడుదలకానున్న హార్ట్ ఎటాక్ ఆడియో

డిసెంబర్ 8న విడుదలకానున్న హార్ట్ ఎటాక్ ఆడియో

Published on Nov 17, 2013 4:00 AM IST

Nithin

పూరి జగన్నాధ్ సరికొత్త చిత్రం ‘హార్ట్ ఎటాక్’ ఆడియో విడుదల డిసెంబర్ 8 న విడుదలకానుంది. ఈ సినిమాను పూరి తన సొంత నిర్మాణ సంస్థ అయిన పూరి జగన్నధ్హ్ టూరింగ్ టాకీస్ లో నిర్మిస్తున్నాడు. నితిన్ మరియు అదా శర్మ హీరో, హీరోయిన్స్. ఈ సినిమాను ఒక నెలపాటు స్పెయిన్ లో షూట్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుపుకుంటుంది. దీనితో టాకీ పార్ట్ పూర్తవుతుంది. డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. నితిన్ కు పూరి డైరెక్ట్టింగ్ స్టైల్ కూడా చాలా నచ్చిందట. అనూప్ రూబెన్స్ స్వరాలను అందిస్తున్నాడు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు