రికార్డు రెస్పాన్స్ తో ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ తాండవం!

రికార్డు రెస్పాన్స్ తో ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ తాండవం!

Published on Jul 4, 2025 9:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న అవైటెడ్ స్ట్రైట్ చిత్రమే “హరిహర వీరమల్లు”. నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో కాలం నుంచి పలు ఇబ్బందులు, కామెంట్స్ ఎదుర్కొంటు వచ్చి పవర్ ఏంటో చూపించింది.

అవైటెడ్ ట్రైలర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో మంచి బజ్ ని సొంతం చేసుకోగా ఆన్లైన్ కూడా రికార్డు రెస్పాన్స్ ని ఈ ట్రైలర్ సొంతం చేసుకోవడం విశేషం. మరి ఈ సినిమా తెలుగు ట్రైలర్ కేవలం 20 గంటల్లోనే 40 మిలియన్ కి పైగా వ్యూస్ ని దక్కించుకొని అదరగొట్టింది. మరి ఆల్ టైం రికార్డుగా పాన్ ఇండియా సెన్సేషనల్ సీక్వెల్ పుష్ప 2 ట్రైలర్ 44 మిలియన్ కి పైగా వ్యూస్ తో ఉంది.

మరి 20 గంటల్లోనే 40 మిలియన్ వ్యూస్ అంటే వీరమల్లు తాండవం ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అది కూడా ఈ సినిమా పవన్ నుంచి కొంచెం తక్కువ హైప్ ఉన్న సినిమానే కావడం విశేషం, ఇప్పుడు ట్రైలర్ తర్వాతే హైప్ మరింత పెరిగింది. ఇక ఇదే ఫ్లో రిలీజ్ వరకు కొనసాగితే మాత్రం భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్క్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు