‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్డేట్.. పట్టాలెక్కేది అప్పుడే..!

‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్డేట్.. పట్టాలెక్కేది అప్పుడే..!

Published on Jul 4, 2025 3:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘ది రాజా సాబ్’ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా హను రాఘవపూడితో ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు చిత్రాలు కూడా వేర్వేరు జోనర్లలో తెరకెక్కుతుండటంతో అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్ నెక్స్ట్ చిత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నాడు. ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోందా.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తాయా అని మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు