ఆరోజున “వీరమల్లు” నుంచి ఈసారి రొమాంటిక్ ట్రీట్?

ఆరోజున “వీరమల్లు” నుంచి ఈసారి రొమాంటిక్ ట్రీట్?

Published on Feb 4, 2025 7:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతికృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అల్రెడీ వచ్చిన పవన్ ట్రీట్ మాట వినాలి సాంగ్ మంచి హిట్ అయ్యింది. ఇక ఇపుడు సినిమా రెండో సాంగ్ పై ఇపుడు టాక్ వినిపిస్తోంది.

దీని ప్రకారం మేకర్స్ నెక్స్ట్ ఒక రొమాంటిక్ నెంబర్ ని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఈ ఫిబ్రవరి 14న వదిలే చాన్సు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ సాంగ్ పవన్ కి నిధి అగర్వాల్ నడుమ సాగుతుంది అని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు