దర్శకుడు హరీష్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక శైలి కలిగిన దర్శకుడు. పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. హిందీ చిత్రం దబంగ్ కి తెలుగు రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ ఒరిజినల్ కి దూరంగా పవన్ ఇమేజ్ కి సరిపోయేలా హరీష్ తెరకెక్కించిన విధానం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ చిత్రం వచ్చి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇన్నేళ్లకు హరీష్-పవన్ ల కాంబినేషన్ సెట్ అయ్యింది. పవన్ తన 28వ చిత్రం హరీష్ శంకర్ తో చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి కొంచెం సమయం ఉంది.
కాగా హరీష్ సూపర్ స్టార్ మహేష్ కోసం కూడా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఆయన ఈ విషయాన్ని స్వయంగా చెప్పడం జరిగింది. ఓ పక్క పవన్ సినిమా పనులు చూసుకుంటూనే ఆయన మహేష్ ని దృష్టిలో పెట్టుకొని మంచి కమర్షియల్ స్క్రిప్ట్ ఒకటి రాస్తున్నట్లు చెప్పారు. ఇంత వరకు మహేష్, హరీష్ కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఓ మాస్ కమర్షియల్ మూవీ రావడం ఖాయం.