విష్ణు, నాగ చైతన్యలకు జన్మదిన శుభాకాంక్షలు

విష్ణు, నాగ చైతన్యలకు జన్మదిన శుభాకాంక్షలు

Published on Nov 23, 2013 9:55 AM IST

vishnu-andnaga-chaithanya
ఇండస్ట్రీలో రెండు పేరుగాంచిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఇద్దరు యువతారాల జన్మదినం నేడు – వారే మంచు విష్ణు మరియు నాగ చైతన్య

మంచు విష్ణు 1981 నవంబర్ 23న చెన్నైలో జన్మించాడు. ఇతను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు. విష్ణు కంప్యూటర్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఇంజినీరింగ్ చేశాడు. అమెరికాలో నటన రంగానికి సంబంధించిన వివిధ కోర్సులలో శిక్షణ తీసుకున్నాడు. ఏం.బి కార్పరేషన్ కి విష్ణు సీ.ఈ.ఓ కూడా.

1985లో ‘రగిలే గుండెలు’ సినిమాతో తెరారంగ్రేటం చేసినా 2003లో ‘విష్ణు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే 2007 లో ‘ఢీ’ సినిమాతో హిట్ రుచి చూశాడు. తరువాత కొన్ని పరాజయాలు ఎదురైనా మళ్ళీ 2012 లో ‘దేనికైనా రెడీ’ , 2013 లో ‘దూసుకెళ్తా’ సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం మంచు వారి మల్టీ స్టారర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ లో నటిస్తున్నాడు

ఇక అక్కినేని నాగ చైతన్య ఇదే రోజున 1986లో నాగార్జున, లక్ష్మి దంపతులకు జన్మించాడు. హైదరాబాద్ కు మకాం మార్చే ముందు చైతూ బాల్యం అంతా చెన్నైలో గడిచింది

2006లో ‘జోష్’ సినిమాతో హీరోగా తెరమీధ కనిపించినా 2010లో ‘ఏం మాయ చేసావె’ సినిమాతో అతనికి ఆశించిన విజయం దక్కింది. 2011 లో ‘100% లవ్’ లో కూడా మెప్పించాడు. ఐతే వరుస ఫ్లాపుల తరువార 2013 లో మరోసారి ‘తడాఖా’ చూపించాడు. ప్రస్తుతం అతను నటించిన ‘ఆటొనగర్ సూర్య’ త్వరలో విడుదలకానుంది. ఇందులోనే కాక అక్కినేని మల్టీ స్టారర్ ‘మనం’లో కూడా నటించాడు.

ఈ ఇద్ధరు యువతారాలకు 123 తెలుగు.కామ్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

తాజా వార్తలు